50 మిలియ‌న్స్ వ్యూస్.. రికార్డ్ సృష్టించిన అఖండ టీజ‌ర్



 AKHANDA
2021-04-29 17:35:35

'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది  ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ‌ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` మీద ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని మ‌రింత పెంచింది. 

ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్‌13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో `అఖండ` టీజ‌ర్ విడుద‌లై యూట్యూబ్‌లో అపూర్వ ఆద‌ర‌ణ‌తో దూసుకెళ్తూ కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ ఇంత‌టి అఖండ విజ‌యానికి కార‌ణ‌మైన అభిమానుల‌కు, ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి అఖండ యూనిట్ అభినంద‌న‌లు తెలుపుతోంది. 

ఈ సంద‌ర్భంగా..చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ  -  ``సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌య్య‌గారితో చేస్తున్న`అఖండ` సినిమాపై ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. బాల‌య్య న‌టవిశ్వ‌రూపాన్నిఈ సినిమాలో మ‌రోసారి చూస్తారు.  అతి త‌క్కువ రోజుల్లోనే 50మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో `అఖండ` టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కి, అభిమానుల‌కి హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌స్తుతం ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్క్ ధ‌రించి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అలాగే అంద‌రూ వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను`` అన్నారు.

చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``మా మూవీ `ఫ‌స్ట్ రోర్‌` విడుద‌లైన ద‌గ్గ‌ర‌ నుండి సినిమాపై మంచి అంఛ‌నాలు ఉన్నాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్ష‌కుల‌లో, అభిమానుల్లో ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. అంద‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని అందుకునేలా బోయ‌పాటిగారు ఈ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. అఖండ టైటిల్ రోర్ ప్రేక్ష‌కుల‌, అభిమానుల ఆద‌ర‌ణ‌తో 50మిలియ‌న్ల వ్యూస్ దాటి మ‌రిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. మా ద్వార‌క క్రియేష‌న్స్ బేన‌ర్‌లో `అఖండ` త‌ప్ప‌కుండా ఒక ప్ర‌స్టేజియ‌స్ మూవీగా నిలుస్తుంది. బాల‌య్యబాబు, బోయ‌పాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న `అఖండ` నంద‌మూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకున్న త‌ర్వాత త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో క‌లుద్దాం`` అన్నారు. 

More Related Stories