శ్రీనువైట్ల డైరెక్షన్ లో అఖిల్



 Akhil Akkineni
2021-07-01 12:27:12

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన "అఖిల్" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా అక్కినేని అభిమానులను నిరాశ పరిచింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. దాంతో అఖిల్ కు ఫ్లాప్ హీరోగా ముద్ర పడిపోయింది. అయితే ప్రస్తుతం అఖిల్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రాన్ని పూర్తి చేశాడు. 

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. ఇది ఇలా ఉండగానే క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా నుండి ఓ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఏజెంట్ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు వరుస హిట్లు తప్ప ఫ్లాపులు ఎరుగని దర్శకుడు శ్రీను వైట్ల తో ఈ యంగ్ హీరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ఢీ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అఖిల్ తో సినిమా చేసే అవకాశం ఉంది.

More Related Stories