బిగ్ బాస్‌లో మరింత రచ్చ.. అవినాష్ చెంప పగలగొట్టిన అఖిల్.. Akhil hits Avinash
2020-10-08 11:34:26

బిగ్ బాస్ 4 తెలుగులో తిట్టుకునే స్థాయి నుంచి కొట్టుకునే స్థాయికి వచ్చేసారు కంటెస్టెంట్స్. తాజాగా ఇదే జరిగింది. ఇన్నాళ్ళూ విమర్శించుకున్నా కూడా ఒకరిపై ఒకరు చేయి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. నామినేషన్స్ వచ్చాయంటే చాలు రచ్చ చేస్తుంటారు కంటెస్టెంట్స్. మొన్న మోనాల్ కోసం అభిజీత్, అఖిల్ మధ్య జరిగిన గొడవ ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్, అవినాష్ మధ్య కూడా పెద్ద రచ్చే జరిగినట్లు కనిపిస్తుంది. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకునే అవినాష్ చెంప చెల్లుమనిపించాడు అఖిల్. అలా ఎందుకు చేసాడనేది మాత్రం అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన విజువల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నామినేషన్స్ వేడెక్కించిన తర్వాత కంటెస్టెంట్స్‌ను కూల్ చేయడానికి ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో హోటల్, రెస్టారెంట్ అంటూ కంటెస్టెంట్స్ తో కామెడీ చేయించాడు. 

అయితే ఈ కామెడీలోనే సీరియస్ అయింది. అఖిల్ వెళ్లి అవినాష్‌ చెంప పగలకొట్టడం మాత్రం ప్రోమోకే హైలైట్. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది.. కావాలని చేసాడా.. లేదంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగానే చెంప చెల్లుమనిపించాడా అనేది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా అది టాస్కులో భాగమే అంటున్నారు నెటిజన్లు. రేటింగ్ కోసం ప్రోమో అలా కట్ చేసి ఉంటారు కానీ అది నిజం కాదని వాదిస్తున్నారు వాళ్లు. అఖిల్ అలా కొట్టిన వెంటనే అవినాష్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడికి సీక్రేట్ టాస్క్ ఇచ్చాడు. ఆ క్రమంలోనే అఖిల్ కచ్చితంగా చేయి చేసుకుని ఉంటాడని తెలుస్తుంది. అందరితో మంచివాడు అనిపించుకుంటున్న అవినాష్ ఈ సీక్రేట్ టాస్కుతో కచ్చితంగా అందరికీ విలన్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. 

More Related Stories