తాత మనవళ్లుగా తండ్రీ కొడుకులు



 Akhil
2021-05-10 18:54:52

టాలీవుడ్ మన్మథుడు నాగర్జున చివరిగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక సోగ్గాడే చిన్ని నాయనా తరవాత మళ్లీ అలాంటి హిట్ లేని నాగ్ మళ్ళీ తన ఆశలన్నీ ఈ సినిమా సీక్వెల్ బంగార్రాజు పైనే పెట్టుకున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ యే బంగార్రాజు చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బంగార్రాజు తో మళ్ళీ ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే నాగ్ ఉన్నారు. 

అంతే కాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సినిమా గురించి తరచు కళ్యాణ్ కృష్ణ తో జూమ్ వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నా అని నాగ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కథ పై కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మొత్తం మూడు జేనరేషన్ లను చూపిస్తారట. అంతే కాకుండా నాగర్జున బంగార్రాజు క్యారెక్టర్ లో నటిస్తుండగా...నాగా చైతన్య నాగ్ కి కొడుకుగా...అఖిల్ మనవుడిగా నటించబోతున్నాడట. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

More Related Stories