అల్లు అర్జున్‌కు ఇప్పుడే పోటీ ఇస్తున్న అకిరా నందన్..alluarjun
2020-04-09 03:11:09

అకిరా నందన్.. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ కొడుకు అనే ఒక్క ట్యాగ్ లైన్ ఈయన్ని స్టార్ గా మార్చేసింది. ఎప్రిల్ 8న ఈయన పుట్టిన రోజు. ఇదే రోజు మెగా కుటుంబంలో మరో స్టార్ కూడా పుట్టాడు. అతడే అల్లు అర్జున్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాతో తన రేంజ్ పెంచుకున్నాడు ఈయన. ఇప్పుడు సుకుమార్ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాడు అల్లు వారబ్బాయి. ప్రస్తుతం ఈయన బర్త్ డే ట్విట్టర్ దేశవ్యాప్తంగా హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ గా ఉంది. అయితే ఇక్కడే బన్నీకి అకిరా పోటీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా బన్నీకి కాస్తో కూస్తో పోటీ ఇస్తున్నాడు అకిరా. బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు #HappyBirthdayAlluArjun అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలో తొలి స్థానంలో ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే మరో మెగా గ్రూప్ #HBDAkiraNandan ను కూడా బాగానే ట్రెండ్ చేసారు. ముఖ్యంగా ఇండియాలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండానే అల్లు అర్జున్ కి పోటీ ఇస్తున్నాడని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. 20 సినిమాల అనుభవం ఉన్న బన్నీని ఇప్పుడు అకిరా ఎదుర్కొంటున్నాడంటూ పండగ చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ లెక్కన అకీరా నందన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఒకవేళ పవన్ కొడుకు పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వస్తే మెగా ఇంట్లో మరో సూపర్ స్టార్ వచ్చినట్లే.

More Related Stories