అక్షయ్‌ కుమార్‌ సీక్రెట్‌ కాల్‌..కంగనా షాకింగ్ కామెంట్స్Akshay Kumar
2021-04-08 17:25:06

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. అలా అని కంగనా టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. అటు వివాదాల పరంగా ఇటు నటన పరంగా రెండింటిలోనూ కంగనా తోపే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సమయంలో బాలీవుడ్ తారల పై వీడియో లు చేసి మరీ సంచలన ఆరోపణలు చేసింది. 

అయితే తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి కంగనా వార్తల్లో నిలిచింది. ఈ సారి ఆ వివాదంలోకి ఖిలాడి అక్షయ్‌ కుమార్‌ని లాగింది. అక్షయ్‌ లాంటి టాప్‌ స్టార్స్‌ అంతా తనకు రహస్యంగా ఫోన్‌ చేసి ప్రశంసించారని చెప్పుకొచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇండస్ట్రీలోని చాలా మంది తనకు సీక్రెట్‌గా అభినందనలు తెలిపారని చెప్పింది. కానీ, దీపిక, ఆలియా భట్ లాంటి వారి సినిమాలకు వచ్చినట్టు తన చిత్రాలకి పబ్లిగ్గా పొగడ్తలు రావని చెప్పింది.

More Related Stories