అక్కడ మహేష్ సినిమాని క్రాస్ చేసేసిన బన్నీmb
2020-01-13 03:07:24

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాలు సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలైన సందడి చేస్తున్నాయి. మన హీరోలు ఎంత స్నేహభావంతో ఉన్నా వారి సినిమాల మధ్య పోటీ అయితే మాత్రం కచ్చితంగా ఉంటుంది. సంక్రాంతి సీజన్‌లో ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో వచ్చే సినిమా హిట్ అయ్యిందంటే ఆ హీరో అభిమానుల ఆనందానికి అవధులుండవు. వచ్చే ఏడాది దాకా కాలర్ ఎత్తుకుని తిరుగుతారు. అయితే ఈ సంక్రాంతికి ఆ ఇబ్బంది లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసిందట. అమెరికాలో 'అల వైకుంఠపురంలో' ఒక రేంజ్‌ లో ఆడుతోంది. ఒక్క అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో కూడా 'అల వైకుంఠపురంలో' రికార్డు క్రియేట్ చేసింది. ఇక అమెరికాలో 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 800k డాలర్లు వసూలు చేసిందట. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఆ దేశంలో ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు మాత్రం 252 ప్రదేశాల్లో విడుదలై 764K కలెక్ట్ చేసిందని అంటున్నారు. అంటే ఆ ఏరియాలో సరిలేరును అల దాటేసినట్టే.

More Related Stories