అమేజాన్‌లో అల వైకుంఠపురములో కనిపించదు.. ఫ్యాన్స్‌కు షాక్..alluarjun
2019-10-16 05:15:50

ఈ రోజుల్లో ఓ కొత్త సినిమా విడుదలైతే నెల రోజుల్లోనే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ అంటూ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వచ్చేస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమా కూడా సెప్టెంబర్ 13న విడుదలై.. అక్టోబర్ 12న వచ్చేసింది. దీనివల్ల థియేటర్స్ లో వచ్చే కలెక్షన్లు చాలానే నష్టపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే వచ్చేస్తుంది కదా అని ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తమ సినిమాకు అలాంటి పరిస్థితి రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నారు అల్లు అర్జున్ నిర్మాతలు. అల వైకుంఠపురములో సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో ఉన్నంతకాలం ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లో చూడలేరని ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసారు. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని బ్లూ స్లై సినిమాస్ విడుదల చేస్తున్నారు. అక్కడ తమ సినిమా అమేజాన్ లో విడుదల కాదని.. ఏ డిజిటల్ మీడియాలో రాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయని వాళ్ల అభిప్రాయం.

విడుదలైన 8 వారాల వరకు పెద్ద సినిమా ఒరిజినల్ ప్రింట్ రాకూడదనేది నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం. కానీ దాన్ని ఎవరూ ఫాలో కావడం లేదు. ఇప్పుడు త్రివిక్రమ్, బన్నీ సినిమాతోనే దీనికి ముహూర్తం పెట్టాలని చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన సినిమాలకు కూడా ఇదే పాలసీ అప్లై చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. టబు కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తుంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More Related Stories