అల వైకుంఠపురములో సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..Ala Vaikunthapurramloo
2020-01-03 16:03:22

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. టాక్ కూడా బాగానే రావడంతో పండగ చేసుకుంటున్నారు చిత్రయూనిట్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అల వైకుంఠపురములో సిద్ధమైంది. త్రివిక్రమ్ మరోసారి ఈ చిత్రంతో మాయ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలు అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో కచ్చితంగా సినిమా కూడా మాయ చేస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. 

తాజాగా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. సినిమాకు యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. ఈ రిపోర్ట్ విన్న తర్వాత ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. సినిమాలో యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ బ్యాలెన్స్ చేసాడు మాటల మాంత్రికుడు. ఈ మధ్యే విడుదలైన సామజవరగమన, రాములో రాములా పాటలు కూడా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసాయి. టీజర్ కూడా ఇదే చేసింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇక టీజర్ లో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఈ టీజర్. దాన్నిబట్టి బన్నీ రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. మీ నాన్న నిన్ను పెళ్లికూతురును దాచేసినట్లు దాచేసాడు.. సరిగ్గా చూడలేదు కూడా అంటూ మొదలైన టీజర్.. మీరిప్పుడే కార్ దిగారు.. నేను కారెక్టర్ ఎక్కా అంటూ పంచ్ డైలాగుతో ముగిసింది. మధ్యలో చాలా చేసాడు బన్నీ. త్రివిక్రమ్ కూడా మంచి కసితో ఈ చిత్రం చేసాడని అర్థమవుతుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే మరోసారి ఇందులో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోంది.

More Related Stories