అల వైకుంఠపురములో ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఎంతంటేala
2020-01-19 19:43:14

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీసు వద్ద తన వేట కొనసాగిస్తోంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా రఫ్ ఆడిస్తోంది. తొలి వారం రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.118.1 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. తాజాగా అలవైకుంఠపురములో సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి కాను .118.1 కోట్ల షేర్ వసూలు చేసినట్టు కొద్ది సేపటి క్రితం యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వేగంగా బన్నీ 100 కోట్ల షేర్స్ అందుకున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక జిల్లా వారీగా చూస్తే నిజాం : -28.84, సీడెడ్ -15.45, వైజాగ్ -15.01, గుంటూరు - 8.58, ఈస్ట్ - 8.12, వెస్ట్ -6.40, కృష్ణా -7.40, నెల్లూరు -3.50, తెలుగు రాష్ట్రాలలో మొత్తం 93.3 Cr, ఇక కర్ణాటక - 9.3, తమిళనాడు, కేరళ అలాగే రెస్టాఫ్ ఇండియా - 3.25, యూఎస్ లో 9.0, రెస్టాఫ్ వరల్డ్-3.25. ఈ రోజు ఆదివారం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా  సినిమా భవిష్యత్తు ఏమిటనేది సోమవారంతో తేలిపోనుంది.

More Related Stories