అల వైకుంఠపురములో అల్లు అర్జున్ సామజవరగమన..allu arjun
2019-09-27 12:54:56

విలక్షణ దర్శకుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో అల్లు అర్జున్‌ హీరోగా అల.. వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని చిన్న మెలోడీ విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ త్వరలో విడుదల కానుందని తెలుపుతూ చిన్న బిట్‌ను అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ చిన్న బిట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. 

‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు..’ అంటూ సాగే ఈ పాటకు ఎస్. ఎస్. థమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. రొటీన్ ట్యూన్స్‌తో కాపీ క్యాట్ అని విమర్శలు వచ్చే తమన్ కి ఈ ట్యూన్ విషయంలో ప్రసంసలు దక్కుతున్నాయి. త్వరలోనే పూర్తి పాట రానుందట.  2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్ వలన  విడుదలకు ముందే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది.  

More Related Stories