వైసీపీలో చేరడమే ఆ కమెడియన్లు చేసిన పాపమా..? Ali Prudhvi
2019-09-05 15:08:39

తెలుగు ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కరిదో కాదు.. అంతా కలిసే ఉంటారు ఇక్కడ. కానీ ఇప్పుడు నిజంగానే కుల రాజకీయాలతో పాటు పార్టీ రాజకీయలు కూడా మొదలయ్యాయని తెలుస్తుంది. మొదట్నంచీ కూడా ఇక్కడ తెలుగుదేశం హవా ఎక్కువగా నడుస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే టాలీవుడ్ లో ఎక్కువగా టీడీపీ సభ్యులే ఉన్నారు. అన్నగారి కాలం నుంచి అంతా ఆయనతో పాటే నడిచారు. దానికితోడు అప్పట్నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కువ మంది తెలుగుదేశంతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ముఖ్యంగా చాలా మంది కమెడియన్లు అక్కడ ఉన్నారు. ఒకేసారి అంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకునే సరికి వాళ్లకు ఇప్పుడు ఇండస్ట్రీలో సరైన అవకాశాలు కూడా రావడం లేదనే వాదన వినిపిస్తుంది. థర్టీ ఇయర్స్ పృథ్వీతో పాటు అలీ, పోసాని లాంటి వాళ్లకు ఇప్పుడు మునపటిలా అవకాశాలు రావడం లేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల అక్కడ బిజీగా మారిపోయారని అనుకున్నారు కానీ అది కాదు అసలు విషయం.. ఇక్కడ వైసీపీలో చేరడంతోనే టీడీపీలో ఉన్న సినిమా సభ్యులు వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఒకప్పుడు అలీ, పోసాని, పృథ్వీ ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ ఇప్పుడు ఈ ముగ్గురూ ఖాళీ అయిపోయారు. అవకాశాలు కూడా రావడం లేదు. తమకు కావాలనే టీడీపీ సభ్యులు ఛాన్సులు రాకుండా చేస్తున్నారని పోసాని ఇప్పటికే ఆరోపించాడు. ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. రాను రాను పరిస్థితి ఇంకెలా మారనుందో..? 

More Related Stories