సీత లుక్ వచ్చేసింది.. అమాయకంగా అలియా భట్..



Alia Bhatt
2021-03-15 11:53:15

RRR సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. విడుదలకు ఇంకా ఆరు నెలలకు పైగా టైం ఉండగానే తన సినిమా ప్రమోషన్ పనుల్లో జోరు పెంచేశాడు. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది అలియా భట్మ్ రామ్ చరణ్ కు జోడీగా ఇందులో కనిపిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అల్లూరి సీతారామరాజు ప్రేమించిన అమ్మాయి పాత్రలో ఆలియా కనిపిస్తుంది. 

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందులో అందంగా, అమాయకంగా ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ రాముడి ముందు కూర్చుని తన రామరాజు గురించి ఆలోచిస్తుంది సీత. ఈ సినిమాలో చాలా చిన్న పాత్రలో నటిస్తుంది అలియా. నిజానికి సీతారామరాజు జీవితంలో కూడా సీత పాత్ర పెద్దగా లేదు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కానీ చివరి నిమిషంలో అల్లూరి తన మనసు మార్చుకుని స్వాతంత్రం కోసం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. దాంతో మరొకరికి ఇచ్చి పెళ్లి చేసే క్రమంలో సీత పెళ్లి పీటల మీద చనిపోతుంది. అక్కడితో ఆమె పాత్ర ముగుస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా అలియా భట్ పాత్ర నిడివి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. దీని కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంది అలియా భట్. అక్టోబర్ 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More Related Stories