తండ్రి ఈవీవీ కధతో నరేష్ సినిమా...సీక్వేలా Allari naresh
2020-03-20 12:47:12

తన కెరీర్ ప్రారంభంలో అల్లరి నరేష్ అంటే మినిమం గ్యారెంటీ హీరో అనే పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళ పాటు రొటీన్ కామెడీ చేసినా వరుస హిట్లు కట్టబెట్టారు ఆడియెన్స్. అయితే జబర్దస్త్ లాంటి కామెడీ షోల పుణ్యమా అని కామెడీ జోనర్ సినిమాలకి కాలం చేల్లినట్టు అయ్యింది. దీంతో చాలా కాలం పాటు సినిమాలు ఏమీ చేయకుండానే సైలెంట్ గా ఉండిపోయాడు నరేష్. మొన్న ఈ మధ్యనే మహేష్ మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరో సినిమా ఒప్పుకున్నాడు. 

నాంది అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి లాంటి వాళ్ళు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నరేష్ కి సంబందించిన ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటి అంటే తన తండ్రి ఈవీవీ సినిమా ఇప్పుడు నరేష్ చేయనున్నాడట. అంటే ఆయన బయోపిక్ అనుకునేరు, కాదు. ఈవీవీ రైటర్, దర్శకుడిగా ఉన్నప్పుడు చాల కధలు రాసుకున్నారు. 

అలా రాసుకున్న వాటిలో చాలా సినిమాలు ఇంకా కధా స్టేజ్ లోనే ఉండిపోయాయి. అలాంటి వాటిలో ఒకదానిని తీసుకుని నరేష్ ఇప్పుడు సినిమా తీయనున్నాడని అంటున్నారు. తనకు బాగా నమ్మకస్తుడైన ఒక కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ సినిమా చేయనున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈ సినిమా ఈవీవీ హిట్ సినిమాకి సీక్వెల్ అని అంటున్నారు. 

More Related Stories