బాలయ్య పాత పాటను కూడా వాడేస్తున్న అల్లరోడుAllari Naresh
2019-07-02 15:20:45

టాలీవుడ్ నటుడు అల్లరినరేశ్ బంగారుబుల్లోడు అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అదేంటంటే 1993లో వచ్చిన బాలయ్య బంగారు బుల్లోడు సినిమాలో బాలయ్య, రవీనాటండన్ కలిసి స్టెప్పులేసిన ‘స్వాతిలో ముత్యమంత’ అనే పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తారట. అప్పట్లోనే ఈ పాట పెద్ద ట్రెండ్ సృష్టించి వర్షం సాంగ్స్ లో టాప్ వరసలో నిలుస్తుంది. నిజానికి పాత సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేయడం మన సినిమాల్లో చాలా కామన్ అయ్యాయి. అయితే అందరు హీరోల కంటే ఎక్కువగా పాటలను రీమిక్స్ చేసిన హీరోల్లో అల్లరి నరేష్ మొదటిస్థానంలో ఉంటాడు. ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ పాటలను తన సినిమాలకోసం రీమిక్స్ చేసి ఆ పాటలకు స్టెప్పులేశాడు. ఇక తాజా పాట కోసం హైదరాబాద్ అన్నపూర్ణలో ఒక స్పెషల్ సెట్ వేసి మరీ రీసెంట్ గా చిత్రీకరణ జరిపారని అంటున్నారు. ఇక 93లో బాలయ్య ఒకేరోజు బంగారుబుల్లోడు, నిప్పురవ్వ రెండు సినిమాలు రిలీజ్ చేస్తే రెండూ సూపర్ హిట్స్ కావడమే కాక రెండు సినిమాలు 100 డేస్ ఫంక్షన్ కూడా జరుపుకున్నాయి. బాలయ్య స్టామినాకి ఈ సినిమాలు మచ్చుతునకలుగా చెబుతూ ఉంటారు.

More Related Stories