అల్లరి నరేష్ ఇక పూర్తిగా మారిపోయినట్లేనా..Allari Naresh
2020-06-29 16:09:49

ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ ను చూసి అబిమానులు కూడా ఇదే అంటున్నారు. అల్ల‌రోడి కెరీర్ మొద‌లై ఇన్నాళ్లైంది.. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా ఈయ‌న లావుగా క‌నిపించ‌లేదు.. గ‌డ్డంతో బ‌య‌టికి రాలేదు. ఎప్పుడూ బ‌క్క‌గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మ‌నోడు పూర్తిగా లుక్ మార్చేసాడు. ఒక‌ప్పుడు మ‌నం చూసిన న‌రేష్ ను ఫోటోలో చూస్తే కానీ అస‌లు మొహం గుర్తుకు రానంత‌గా మారిపోయాడు. అదంతా కొత్త సినిమా నాందీ కోస‌మే. కొత్తదనానికి కూడా నాందీ పలికాడు నరేష్. ఎందుకంటే ఈ చిత్రంలో ఈయన పాత్ర అలా ఉండబోతుంది మరి. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలే చేసాడు కాబట్టి కేరాఫ్ కామెడీ అయిపోయాడు నరేష్. కానీ ఇప్పుడు తనలో ఉన్న నటుడికి పని చెబుతున్నాడు. హిట్ కోసం కొత్తదనం వైపు పరుగులు తీస్తున్నాడు. ఈయన నటిస్తున్న కొత్త సినిమా నాంది. ప్రాణం, గమ్యం తరహాలో పూర్తిగా కొత్త తరహా సినిమా ఇది.
 
ఈయన నటిస్తున్న 57వ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇఫ్పుడు మరో లుక్ విడుదల చేసారు. అందులో కూడా నగ్నంగానే ఉన్నాడు నరేష్. ఇందులో నరేష్ గెటప్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మహర్షి సినిమాలో సీరియస్ పాత్రలో మెప్పించిన ఈయన.. ఇప్పుడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి ప్రయోగం చేస్తున్నాడు. దీనికి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాత కావడం విశేషం. మొదటి పోస్టర్ లో నగ్నంగా పోలీస్ స్టేషన్ లో తలకిందులుగా వేలాడదీసి ఉన్న నరేష్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు కూర్చున్న పోస్టర్ విడుదల చేసారు. కొత్తదనం కోసం నరేష్ ప్రయత్నించడం నిజంగానే మెచ్చుకోదగిన విశేషం. ఇది విజయం సాధిస్తే కచ్చితంగా నరేష్‌లోని మరో కోణం బయటికి వస్తుంది.

More Related Stories