కరోనా వైరస్ ను క్యాష్ చేసుకుంటున్న అల్లు అరవింద్...Allu Aravind.jpg
2020-03-16 15:51:45

తెలుగు ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బిజినెస్ మేన్ అంటే అల్లు అరవింద్ తర్వాతే ఎవరైనా గుర్తొస్తారు. డబ్బులు ఎలా సంపాదించాలి.. లాభాలు ఎలా రాబట్టుకోవాలి అనేది ఆయన కంటే బాగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరికీ తెలియదు. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా లాభాలు ఎక్కువగా ఆర్జిస్తుంటాడు అల్లు అరవింద్. ఇప్పుడు కూడా ఓ విషయంలో ఇదే జరుగుతుంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు భయంతో చచ్చిపోతున్నారు. అలాంటి వైరస్ ను కూడా ఇప్పుడు తన వ్యాపారం కోసం వాడుకుంటున్నాడు ఈ నిర్మాత.

దేశాన్ని కుదిపేస్తోన్న కరోనా ఎఫెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఏకంగా మార్చి 31వరకూ సినిమా థియేటర్స్ మూసేసింది. దాంతో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయిపోయింది. ప్రతీ వారం సినిమాకి వెళ్ళాలి అనుకునే వాళ్లకు కరోనా వైరస్ శాపంగా మారింది. దాన్ని ఇప్పుడు తన ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం వరంగా మార్చుకున్నాడు అల్లు అరవింద్. తన మాస్టర్ బ్రెయిన్ కు పదును పెట్టి ఆ మధ్య లాంచ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను సరైన సమయంలో రంగంలోకి దించాడు. ఇది మొదలైన తర్వాత కొన్ని రోజుల పాటు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోలేదు. అయితే కరోనా వైరస్ వచ్చిన తర్వాత జనాలకు వినోదం తక్కువ కావడంతో ఆహా ప్లాట్ ఫామ్ వరస సినిమాలను వదులుతున్నాడు అల్లు అరవింద్.

ఇక ఈ యాప్ కోసం విజయ్ దేవరకొండతో పాటు అల్లు అర్జున్ కూడా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇందులో కొత్త సినిమాలతో పాటు సరికొత్త వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేస్తున్నాడు అల్లు అరవింద్. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు బాగా అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆహా యాప్ కూడా బాగానే చూస్తున్నారు. బయట నలుగురు మనుషులు కలిసి మాట్లాడుకోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్ ఫాం లో సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.

అందుకే ఇప్పుడు తన ఆహాలో.. ఖైదీ, అర్జున్ సురవరం, ప్రెషర్ కుక్కర్, చూసీ చూడగానే, నెపోలియన్, దేవ్, కథనం, సూర్యకాంతం.. ఇలా చాలా సినిమాలు విడుదల చేశాడు అల్లు అరవింద్. వాటితో పాటు అడల్ట్ వెబ్ సిరీస్ లు, కామెడీ షో లు కూడా విడుదల చేస్తున్నాడు. ఏదేమైనా కూడా థియేటర్లకు వెళ్లలేని జనం ఆహా యాప్ తో పండగ చేసుకుంటున్నారు. ఇలా కరోనా వైరస్ ను కూడా తన బిజినెస్ కోసం వాడుకుంటున్నాడు అల్లు అరవింద్.

More Related Stories