సంక్రాంతి పోరులో అల్లు అరవింద్, దిల్ రాజు ఏం చేస్తున్నారు..dil
2019-10-13 07:05:50

ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రావడం అనేది పెద్ద విషయమేం కాదు. గత రెండు మూడు సంక్రాంతి సీజన్స్ లో ఒకేసారి నాలుగు సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే మరీ ఒకే రోజు రావడం మాత్రం నిజంగానే విడ్డూరం. ఈ విషయంలో హీరోల సంగతి ఎలా ఉన్నా కూడా నిర్మాతలు మాత్రం దారుణంగా నష్టపోతారు. ఇక బయ్యర్లకు కనీసం నిద్ర కూడా రాదు. ఇప్పుడు మహేష్ బాబు, బన్నీ సినిమాల విషయంలో నిర్మాతలు ఇదే కంగారు పడుతున్నారు. పోనీ ఈ రెండు సినిమాలకు నిర్మాతలు కొత్త వాళ్లా అంటే కాదాయే..? ఒకరు అల్లు అరవింద్.. మరొకరు దిల్ రాజు. ఇద్దరికి బోలెడన్ని థియేటర్స్ ఉన్నాయి. దాంతో ఆ ధైర్యంతోనే ఇప్పుడు తమ సినిమాలను జనవరి 12న విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇదే వేరు నిర్మాతలు అయితే భయపడేవాళ్లు. మహేష్ బాబు సినిమా వస్తే తమకు థియేటర్స్ ఎక్కడ దొరకవో అని.. అలాగే అల్లు అర్జున్ వస్తే తమకు స్క్రీన్స్ ఎక్కడ అరవింద్ ఇవ్వకుండా ఆడుకుంటాడేమో అని భయం కనిపించేది.

కానీ ఇక్కడ దిల్ రాజు, అల్లు అరవింద్ గేమ్ లో ఉండటంతో ఇద్దరికీ ఈ థియేటర్స్ ఆట కొత్తది కాదు. మరి ఏ నమ్మకంతో ఒకేరోజు వస్తామని సవాల్ చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఏదో ఓ సినిమా వెనక్కి తగ్గకపోతే కచ్చితంగా ఇద్దరూ భారీగా నష్టపోవడం ఖాయం. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా తొలిరోజు వచ్చే వసూళ్లకు అయితే గండి పడుతుంది. మరి ఈ విషయంలో రాజు, అరవింద్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలిక.

More Related Stories