అల వైకుంఠపురములో టీజర్ వచ్చేస్తుందహో.. గెట్ రెడీ..ala
2019-12-08 16:17:50

కొన్నిసినిమాలపై అంచనాలు పెంచడానికి ట్రైలర్స్ విడుదల కావాల్సిన అవసరం లేదు. జస్ట్ పాటలు బాగుంటే చాలు.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇదే ప్లాన్ చేసాడు. ఈయన ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ముందు ఎందుకో కానీ కాస్త తక్కువ అంచనాలున్నాయి. బన్నీ వరస ఫ్లాపుల్లో ఉండటంతో ఆ ప్రభావం దీనిపై కూడా కనిపించింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలా అని ఆలోచించి ఓ పాటను విడుదల చేసాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' విడుదల కాగానే సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనాలు రేపుతుంది. ఏకంగా తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఏ పాట సృష్టించనన్ని రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన రాములో రాములా పాట కూడా అంతే. మూడో పాట ఓ మై గాడ్ డాడీ కాస్త తక్కువగా పర్ఫార్మ్ చేసిన కూడా పర్లేదనిపించింది. ఇక ఇప్పుడు టీజర్ విడుదల కానుంది. డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. దీంతో సినిమాకి ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కచ్చితంగా బన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కంకణం కట్టుకున్నాడు త్రివిక్రమ్.

More Related Stories