బన్నీ సుకుమార్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్allu
2020-02-24 05:17:31

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఆర్య, ఆర్య 2 వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి స్మగ్లింగ్ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నారు. గతేడాదే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం జనవరిలో షూటింగ్ మొదలవ్వాలి. అయితే అల వైకుంటపురంలో సినిమా వల్ల అల్లు అర్జున్ ఈ సినిమాని చిత్రాన్ని డిలే చేస్తూ వచ్చారు. ‘ఏఏ 20’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక నాయిక. ‘శేషాచలం’ అనే పరిశీలనలో ఉంది. ఇంకా బన్నీ పార్ట్ షూటింగ్ మొదలుకాకపోవడంతో రకరకాల వార్తలు షికార్లు చేయడం మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు ప్రాంత కుర్రాడిగా మాస్‌ లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే తాజాగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒకటి ఫుల్‌ మాస్‌ అవతారం కాగా మరొకటి క్లాస్‌ ఉండనుందని అంటున్నారు. ఇప్పటి వరకు బన్నీ ఏ సినిమాలోనూ రెండు పాత్రలు పోషించలేదు. తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడనటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

 

More Related Stories