కొత్తింటికి అల్లు అర్జున్ భూమి పూజ.. Allu Arjun
2019-10-03 17:42:09

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సొంతింటి కల నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పటి దాకా తల్లి తండ్రులు సోదరులతో కలిసి ఉంటున్న బన్నీ కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. నిజానికి జూబ్లీ హిల్స్ ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు సోదరులు బాబీ, అల్లు శిరీష్ కూడా ఉంటున్నారు. ఈ మధ్యే బాబీకి పెళ్లయింది. ఈ నేపథ్యంలో కొత్త ఇంటిని నిర్మించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని సమాచారం. కేవలం తన కుటుంబంతో కలిసి ఉండేందుకు ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి రీసెంట్‌గా భూమి పూజ కూడా చేశాడు. 

అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. అలాగే తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన పిక్‌ పోస్ట్ చెయ్యగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతకొద్ది రోజులుగా ‘అల వైకుంఠపురములో’ షూటింగుతో బిజీగా ఉన్న బన్నీ షెడ్యూల్ గ్యాప్ దొరకడంతో మంచి రోజు చూసి భూమి పూజ చేశాడు. తన టేస్ట్‌కి తగ్గట్టు లగ్జీరియస్‌గా ఇంటిని నిర్మించుకుంటున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories