అల్లు అర్జున్ కెరీర్‌ మార్చేసిన ఆర్యకు 16 ఏళ్లు..arya
2020-05-07 14:21:16

గంగోత్రి సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌కు విజయం తీసుకొచ్చిన ఆనందం కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. బ్యాగ్రౌండ్ ఉంటే హీరో అయిపోవచ్చా.. ఎలా ఉన్నా పర్లేదా అంటూ బన్నీతో ఆడుకున్నారు విమర్శకులు. డబ్బులున్నాయి.. తండ్రి నిర్మాత కాబట్టి రుద్దేస్తున్నారంటూ అనే మాటలు కూడా వచ్చాయి. అలాంటి వాళ్లకు సమాధానం ఒక్క సినిమాతో ఇచ్చాడు బన్నీ. అదే ఆర్య.. 2003లో గంగోత్రి విడుదలైతే.. ఒక్క ఏడాది తర్వాత 2004 మే 7న విడుదలైంది ఆర్య. సుకుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఆర్య.. తెలుగులో ట్రెండ్ సెట్టర్. అను మెహతా హీరోయిన్.. ఈ సినిమాలో శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు. దేవీ శ్రీ పాటలు ఇప్పటికీ సంచలనమే.

అప్పటి వరకు మనం చూసిన ప్రేమకథలకు ఆర్యకు అస్సలు పోలిక లేదు.. సంబంధం అంతకంటే లేదు. ఇలాంటి ప్రేమకథ కూడా తీయొచ్చా అనేంతగా లెక్కల మాస్టారు ఈ చిత్రం చేసాడు. ఆర్యతో ఒక్కసారిగా బన్నీ కెరీర్ రయ్యిమంటూ పైకెళ్లింది. ఈ చిత్రం అప్పట్లోనే సంచలన రికార్డులు తిరగరాసింది. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న బన్నీ ఆర్యతో దాదాపు 20 కోట్ల వరకు వసూలు చేసాడు. దిల్ రాజుకు కాసుల పంట పండించింది ఆర్య. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 16 ఏళ్లు గడిచిపోయింది. యాదృశ్చికంగా ప్రస్తుతం అల్లు అర్జున్ మరోసారి సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. మధ్యలో ఆర్య 2 కూడా చేసాడు. ఇఫ్పుడు మూడోసారి కలిసి పని చేస్తున్నారు.

More Related Stories