అల్లు అర్జున్ అభిమానులు అసాధ్యులే.. AA20ఫేక్ పోస్టర్..Allu Arjun
2020-03-31 00:06:00

ఈ పోస్టర్ చూసి కంగారు పడుతున్నారా.. అల్లు అర్జున్ ఏంటి ఇలా ఉన్నాడు అని. ఇప్పుడు ఈ పోస్టర్ అఫీషియల్ కాదు. అభిమానులు ఈ పోస్టర్ డిజైన్ చేశారు. బన్నీ అంటేనే స్టైలిష్ స్టార్. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు ఈయన. కథలు ఎలా ఉన్నా కూడా లుక్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటాడు అల్లు వారబ్బాయి. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. సుకుమార్ తో తర్వాతి సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. 

శేషాచలం అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ రాసుకున్నాడు సుకుమార్. ఇందులో పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెడ్డం పెంచుతున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో డైలాగుల కోసం ప్రత్యేకంగా ముగ్గురు తెలుగు టీచర్ లను పెట్టుకున్నాడు బన్నీ. ఇక ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటుస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మధ్యే ఖైదీ సినిమాలో కార్తి కూడా లారీ డ్రైవర్ గానే కనిపించాడు. ఇప్పుడు బన్నీ కూడా అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాడు సుకుమార్. ముఖ్యంగా స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు సుకుమార్. ఈ సినిమాలో అనసూయ విలన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా గడ్డం పెంచుతున్నాడు అల్లు అర్జున్. 

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కూడా గడ్డంతోనే కనిపించాడు. ఇప్పుడు కూడా తన హీరోని మరోసారి గడ్డంతో చూపించబోతున్నాడు సుకుమార్. ఇంతకు ముందు ఎన్టీఆర్, రామ్ లాంటి హీరోలతో కూడా గడ్డం పెంచమని చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పుడు బన్నీతో కూడా ఇదే చేస్తున్నాడు. చిత్తూరు కుర్రాడిగా ఇందులో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. ఆ యాసను పట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు బన్నీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

ఇక ఆర్య, ఆర్య 2 తర్వాత మూడోసారి బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. కాస్ట్యూమ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. అన్నింటికీ మించి బన్నీ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించబోతోంది. ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అల్లు అర్జున్. ఇక సుకుమార్ కూడా రంగస్థలం మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. 

More Related Stories