టైటిల్ మార్పించిన బన్నీ...సెంటిమెంట్ అట Allu Arjun
2020-04-04 17:22:05

తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను నమ్మని వ్యక్తులు చాలా అరుదు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. మిగతా వారి సంగతి ఏమో కానీ ముఖ్యంగా హీరోలు, దర్శకులకి చెందిన ఈ సెంటిమెంట్ లు మాత్రం వార్తల్లోకి వస్తూ ఉంటాయి. రాఘవేంద్ర రావు సినిమా షూటింగ్ మొదలయ్యిందంటే గెడ్డం తీయరు, కోడి రామకృష్ణ తలకు బ్యాండ్, త్రివిక్రమ్ కి అ సెంటిమెంట్. అనిల్ రావిపూడికి ఏదో ఒక విచిత్రమైన సౌండింగ్. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ అన్న మాట. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ని సుకుమార్ కూడా నమ్ముకున్నాడని అంటున్నారు. నిజానికి ఆయనే సుకుమార్. దర్శకుడు సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. 

ఇందులో బన్నీ గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం మొదటి నుండీ జరుగుతోంది. ఈ గడ్డం ఒక రకంగా సెంటిమెంట్ అయితే ఇప్పుడు టైటిల్ విషయంలో బన్నీ ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట. ఆర్య, బన్ని, హ్యాపీ, వేదం, ఆర్య 2, డీజే లాంటి రెండక్షరాల సినిమాలు బాగా ఆడిన నేపధ్యంలో అలానే షార్ట్ అండ్ స్వీట్ గా టైటిల్ ఉండేలా చూడమని సుకుమార్ ని కోరినట్టుగా చెబుతున్నారు. శేషాచలం అడవులలో దొరికే ఎర్రచందం నేపధ్యంలో సాగే చిత్రం కావడంతో ‘శేషాచలం’ అనే టైటిల్‌ ప్రచారం లో ఉంది. అయితే బన్నీ కోరిక మెరక కొత్త పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. అయితే అది అమ్మాయి పేరు కావచ్చని, అంటే హీరోయిన్ పాత్ర అయి ఉండవచ్చని అంటున్నారు.  

More Related Stories