చిత్తూరు యాస కోసం బన్నీ కసరత్తులు  Allu Arjun
2020-03-27 21:13:54

అల వైకుంఠపురంలో లాంటి హిట్ తర్వాత బన్నీ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ లేకుండానే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ షూట్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బ వేయడంతో మనోడు అలాగే యూనిట్ అంతా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ సమయాన్ని గట్టిగానే వాడుతున్నాడట.  ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ సుకుమార్ సినిమాలో క్యారక్టర్ కు ఉన్న చిత్తూరు యాస ట్రైనింగ్ లో తీసుకున్తున్నాడట.  షూట్ కి వెళ్ళే నాటికి తన పాత్రకు సంబంధించిన సంభాషణలన్నింటినీ సమర్థవంతంగా అదే యాసలో పలకగలిగేలా ఏకంగా ముగ్గురు ట్యూటర్స్ ని పెట్టుకొని మరీ శిక్షణ తీసుకుంటున్నాడట బన్నీ. 

రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ మాండలికంలో మాట్లాడి బన్నీ అదరగొట్టాడు. అప్పుడు ఆ యాసను సరిగ్గా మాట్లాడడానికి బిత్తిరి సత్తిని నియమించుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా చిత్తూరు యాస కోసం చిత్తూరు నుండి ప్రత్యేకంగా ముగ్గిరిని పిలిపించుకుని తన ఇంట్లోనే ఉంచి షిఫ్ట్ ల వారీగా నేర్చుకుంటున్నాడట. సినిమాలో ఎక్కువ శాతం అడవుల లోపలే జరుగనుందట. ఇందు కోసం కేరళ, వికారాబాద్‌ అటవీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను, ఆ తర్వాత బ్యాంకాక్‌ అడవుల్లో మరికొన్ని సీన్లను తెరకెక్కించనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. బన్నీ సరసన రష్మిక మందన్న నటించనున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుందని ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. అందుకే ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని చెబుతున్నారు. 

More Related Stories