బన్నీతో సినిమా ఫైనల్ చేసిన యాత్ర దర్శకుడుAllu Arjun
2020-07-15 08:34:16

దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయన చేపట్టిన పాదయాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాదయాత్రను కథాంశంగా చేసుకుని యాత్ర పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్ మమ్ముటి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించారు. ఫిబ్ర‌వ‌రి 8, 2019న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2019 లో విడుదలైన హిట్ చిత్రాల సరసన చేరింది. ఈ సినిమా చేశాక ఆయన మరో సినిమా ఏదీ ప్రకటించలేదు. అయితే ఆయన కొత్త సినిమా పై ఓ లేటెస్ట్ అప్ డేట్ ఏమింటంటే ఈయన బన్నీతో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. మహి చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని, కానీ బన్నీ పూర్తి స్క్రిప్ట్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహి తమ బ్యానర్ లో ‘సిండికేట్’ అనే సినిమాను తియ్యబోతున్నాడని పీవీపీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఆ మధ్య అధికారికంగా ప్రకటించింది. మరి ఏమవుతుందో ? చూడాలి

More Related Stories