అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. మేనమామ కన్నుమూత..allu
2020-01-23 08:31:55

కొన్ని రోజులుగా అల వైకుంఠపురంలో సినిమా విజయోత్సవంలో తేలిపోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా సాధించిన విజయం ఈయన రెండేళ్ల గ్యాప్ మొత్తాన్ని తుడిచేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు చేసుకుంటూనే సుకుమార్ సినిమాకి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. ఇలాంటి తరుణంలో ఆయనకు అనుకోని బ్యాడ్ న్యూస్ ఎదురైంది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విజయవాడలో జనవరి 22 ఉదయం ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈయన కేవలం అల్లు అర్జున్ కు మేనమామ మాత్రమే కాదు.. నటించబోయే సినిమాకు నిర్మాత కూడా. సుకుమార్ సినిమాతోనే ప్రసాద్ నిర్మాతగా మారారు. ఈ సినిమా ఓపెనింగ్ లో కూడా ఆయన సందడి చేశాడు. అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల కు స్వయానా అన్నయ్య. ముత్తంశెట్టి ప్రసాద్ మేనమామ హఠాన్మరణంతో అల్లు అర్జున్ విషాదంలో మునిగిపోయాడు. ఇక అల్లు కుటుంబం కూడా అనుకోని షాక్ తో కన్నీరు పెట్టుకుంటున్నారు. చిన్నప్పటినుంచి మేనమామతో అల్లు అర్జున్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మరణ వార్తతో విజయవాడ బయల్దేరారు అల్లు అర్జున్ కుటుంబం.

More Related Stories