అల్లు అర్జున్, సుకుమార్ సినిమా లాంఛ్.. దిల్ రాజుకు షాక్..dilraju
2019-10-29 21:00:29

అదేంటి.. వాళ్ల సినిమా ఓపెన్ అయితే ఈయనకు వచ్చిన నష్టమేంటి అనుకుంటున్నారా.. ఉంది కచ్చితంగా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఎవరిది ముందు పూర్తి చేస్తాడనేది మాత్రం కాస్త కన్ఫ్యూజన్ అంతే. త్రివిక్రమ్ సినిమా ఎలాగూ సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే అల వైకుంఠపురములో షూటింగ్ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని.. జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత సుకుమార్, వేణు శ్రీరామ్ సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. అయితే ముందు అల్లు అర్జున్ 20 అంటూ దిల్ రాజు తన సినిమాను ప్రకటించాడు. దాన్ని పూర్తి చేయడానికి కూడా పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నాడు బన్నీ. కానీ ఇప్పుడు మధ్యలోకి సుకుమార్ వచ్చేసాడు.

ఈయన సినిమా ముందు పట్టాలెక్కించబోతున్నాడు బన్నీ. అసలు వేణు శ్రీరామ్ తో చేయాలనుకున్న ఐకాన్ సినిమా ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు అర్థం కావడం లేదు. మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత బన్నీని ఎంచుకున్నాడు సుకుమార్. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వేణు ఐకాన్ ఉంటుందని కొందరు.. లేదు కథ నచ్చకపోవడంతో ఆగిపోయిందని మరికొందరు వినిపిస్తున్న వాదన. దీనిపై దిల్ రాజు కూడా మౌనంగానే ఉన్నాడు. అసలు ముందు తన సినిమా మొదలుపెడతాడేమో అనుకుంటే.. దానికి షాక్ ఇచ్చి సుకుమార్ మైత్రి సినిమాను ముందుకు తీసుకెళ్లడమే ఆశ్చర్యంగా ఉంది. మరి చూడాలిక.. ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే తేలిపోనుంది.

More Related Stories