కొర‌టాల త‌ప్పుకోవ‌డంతో వేణు శ్రీరామ్ కు లైన్ క్లియ‌ర్Allu Arjuns ICON
2021-04-20 12:25:10

ఓమై ప్రెండ్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రియం అయిన ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్. ఆ త‌ర‌వాత వేణు శ్రీరామ్ చాలా గ్యాప్ తీసుకుని ర‌వితేజ‌తో ఒక సినిమా నానితో ఎంసీఎ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. వీటిలో ఎంసీఎ మంచి విజ‌యం సాధించింది. దాంతో వేణు శ్రీరామ్ కు ఇండ‌స్ట్రీలో గుర్తింపు ల‌భించింది. ఇక ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో వ‌కీల్ సాబ్ ను తెర‌కెక్కించి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నాడు. దాంతో ఇప్పుడు అంద‌రి చూపు వేణు శ్రీరామ్ పైనే ఉంది. ఇక క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నా వేణు శ్రీరామ్ కు ఓ అసంతృప్తి ఉంది. అల్లు అర్జున్ తో ముందుగా అనుకున్న ఐకాన్ సినిమా ప‌ట్టాలెక్కాల్సిఉండ‌గా బ్రేక్ ప‌డింది. 

మ‌రోవైపు బ‌న్నీ పుష్ప త‌ర‌వాత కొర‌టాల‌తో ఓ ప్రాజెక్టు ఒప్పుకున్నారు. ఆ త‌ర‌వాత ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమా అనుకున్నారు. దాంతో వేణు శ్రీరామ్ ప్రాజక్ట్ ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యే ఛాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా కొర‌టాల శివ అల్లు అర్జున్ తో సినిమాను స‌డెన్ గా వాయిదా వేసుకున్నారు. దాంతో ఇప్పుడు వేణు శ్రీరామ్ కు లైన్ క్లియ‌ర్ అయింది. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజు కూడా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్యూలో త్వ‌ర‌లోనే ఐకాన్ ప‌ట్టాలెక్కుతుంద‌ని వెల్లడించారు. ఇక ఈ గోల్గెన్ ఛాన్స్ ను వేణు శ్రీరామ్ వినియోగింకుంటారా లేదా చూడాలి.  
 

More Related Stories