శిరీష్ విషయంలో అల్లు అరవింద్ అశ్రద్ధగా ఉన్నాడా..sirish
2020-03-09 14:04:10

అల్లు అర్జున్ చిన్న కొడుకు విషయంలో చిన్నచూపు చూస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నాడు. మరోవైపు ఆయన పెద్దకొడుకు బాబీ నిర్మాతగా మారిపోయాడు. చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రమే హీరోగా నిలబడలేకపోయాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. గతేడాది ఆయన నటించిన ఏబిసిడి సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఒకప్పుడు అల్లు శిరీష్ కోసం తన సొంత బ్యానర్ లో సినిమాలు తీసిన అల్లు అరవింద్ ఇప్పుడు మాత్రం ఆయనపై బడ్జెట్ పెట్టడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మారుతి దర్శకత్వంలో కొత్తజంట.. పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాలు నిర్మించాడు అల్లు అరవింద్. ఈ రెండు సినిమాలే అల్లు శిరీష్ కెరీర్లో కాస్త గుర్తింపు తీసుకొచ్చాయి. బయటి ప్రొడక్షన్ హౌస్ లో చేసిన శిరీష్ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఇలాంటి సమయంలో మరోసారి కొడుకు కెరీర్ ను అల్లు అరవింద్ చక్కదిద్దుతాడేమో అనుకుంటే అసలు అటువైపుగా ఆలోచించడం లేదు. ఇది చూసి మెగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అన్నింటికీ మించి అల్లు శిరీష్ ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. అసలు సినిమాలు చేస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అందుకే చిన్న కొడుకు విషయంలో అల్లు అరవింద్ అశ్రద్ధ చూపిస్తున్నాడని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఇందులో ఎంత వరకు నిజం ఉం

More Related Stories