హీరోయిన్ తో అల్లు శిరీష్ స‌ర‌సాలు...నెట్టింట ర‌చ్చ‌



 Allu Sirish
2021-05-07 12:27:51

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ హాట్ హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ప్రేమ ప‌డ్డార‌ని కొంత‌కాలంగా ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియదు కానీ వీరిద్ద‌రి వ్య‌వ‌హారం చూస్తే నిజ‌మేన‌ని అనిపిస్తుంది. అంతే కాదు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వ‌స్తున్నాయి. ఇక ఇద్ద‌రూ క‌లిసి కాఫీ షాప్ ల‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా సెట్ లో గ్యాప్ దొరికిన‌ప్పుడు వీడియోల‌తో ర‌చ్చ చేస్తున్నారు.  అప్ప‌ట్లో అనూ పుట్టిన రోజు కు శిరీష్ లేట్ గా విష్ చేసాడ‌ని అలిగింద‌ట‌. దాంతో ఓ వీడియో చేసి లేట్ గా విష్ చేసినందుకు స్వారీ అంటూ చెప్పాడు శిరిష్. ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైర‌ల్ అయింది. 

ఇక తాజాగా వీరి వ్య‌వహారం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. దానికి కార‌ణం ఇద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డ‌మే. తాజాగా అనూ ఇమాన్యుయేల్ కు అల్లు శిరీష్ ఓ టీష‌ర్ట్ ను గిఫ్ట్ గా పంపించాడు. ఆ టీష‌ర్ట్ పై ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ రాసి ఉంది. ఇక ఆ టీష‌ర్ట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన అనూ వెరైటీగా స్పందించింది. తాను దీనిని కాంప్లిమెంట్ గానే తీసుకుంటున్నాన‌ని ..త‌న‌కు సెట్ అయ్యే టీష‌ర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ పేర్కొంది. ఇక అనూ కు రిప్లై ఇచ్చిన శిరీష్..అలా అయితే మ‌నిద్ద‌రి మ‌ధ్య కామ‌న్ విష‌యాలెన్నో యు ఆర్ వెల్ క‌మ్ మై..... అంటూ డ్యాష్ పెట్టాడు.  శిరీష్ పెట్టిన డ్యాష్ ను ఇప్పుడు నెటిజ‌న్లు ఫిల్ చేసుకుంటున్నారు. ఇక నిజంగానే ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారా.?  లేదంటే సినిమా కోసం బిల్డ‌ప్ ఇస్తున్నారా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

More Related Stories