హిందీలో సింగిల్ చేసిన తొలి సౌత్ ఇండియన్ హీరో అల్లు శిరీష్.. Allu Sirish
2021-03-22 19:55:13

అల్లు శిరీష్ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నాడు. ఈ మాట అనడానికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే అల్లు శిరీష్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆయన ట్రెండ్ సెట్టర్ అనాల్సి వస్తుంది. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేశాడు అల్లు శిరీష్. IIFA, ఫిలిం ఫేర్, SIIMA ఇలాంటి పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్లకు హోస్టింగ్ చేశాడు. యూ ట్యూబ్ లో ఇప్పటికీ కొందరు అభిమానులు ఈ అవార్డు ఫంక్షన్ లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటారు. టిక్ టాక్ ను మిలియన్ల ఫాలోవర్స్ దక్కించుకున్న తక్కువ మంది హీరోల్లో శిరీష్ కూడా ఉన్నాడు. 

ఇక ఇప్పుడు ఎలా హిందీ సింగిల్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. విలయతి సాహెబ్ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్స్ దర్శన్ రావల్, నీతి మోహన్ పాడారు. భాష అనేది ఎప్పుడు అల్లు శిరీష్ కు ఒక గోడలా నిలవలేదు. ఈయన మలయాళంలోనూ నటించాడు. 1971 బియాండ్ బోర్డర్స్ సినిమాలు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. దీని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. 

సినిమాలు మాత్రమే కాకుండా ఫిట్నెస్, హెల్త్ గురించి కూడా అల్లు శిరీష్ ఆసక్తి చూపిస్తాడు. ఈ మధ్య బరువు తగ్గి స్లిమ్ లుక్ లో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో అవి బాగా వైరల్ అయ్యాయి. కొత్త కొత్త స్టైల్స్ ఫాలో కావడంలోనూ అల్లు శిరీష్ ది ప్రత్యేకమైన శైలి.

More Related Stories