పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్Allu Sirish
2020-12-18 16:10:54

ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మెగా ఫ్యామిలిలో పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరంటూ మెగా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా త్వరలో అల్లు శిరీష్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సాయి ధరమ్ తేజ్ కామెంట్ చేసాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ కు పెళ్లి ప్రస్తావన రాగా తేజ్ మాట్లాడుతూ... 

శిరిష్ నా కంటే పెద్ద వాడు. వచ్చే ఏడాది తన పెళ్లి జరగవచ్చు. నేను పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తిచేయాలి" అంటూ కామెంట్స్ చేసాడు. దాంతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ పెళ్ళి అంటూ తెగ వైరల్ అయిపోయింది. పలు మీడియా ఛానళ్లు కూడా త్వరలో అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు ప్రచురించాయి. దాంతో తాజాగా ఆ వార్తలపై అల్లు శిరీష్ ట్విట్టర్ వేధికాగా స్పందించారు..తనకు ఇంట్లో పెళ్లి పై ఎలాంటి ఒత్తిడి లేదని..సాయి ధరమ్ తేజ్ సరదాగా కామెంట్స్ చేస్తే మీరు సీరియస్ గా తీసుకున్నారంటూ ట్వీట్ చేసాడు. పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా చెబుతానని అన్నాడు.

More Related Stories