సంక్రాంతి బరిలోకి అల్లుడు అదుర్స్ Alludu Adhurs
2020-12-28 15:59:11

హీరో బెల్లంకొండ లేటెస్ట్ సినిమా అల్లుడు అదుర్స్ సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.సోనూసూద్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోశ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. నభానటేశ్‌,  అను ఇమాన్యుయెల్‌ కథానాయికలు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు ‘అల్లుడు సీను’. ప్రభాస్‌ హీరోగా తెలుగులో మంచి విజయం సాధించిన ‘ఛత్రపతి’కి హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. 

More Related Stories