ఆ టైటిల్ రిజిస్టర్ చేయించింది పవన్ సినిమా కోసమేనా..Pawan kalyan
2020-04-04 18:03:02

ఇంకా అసలు సినిమాలే చేయనని చాలా సార్లు బల్లగుద్ది చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీప్రియులకు కూడా డబుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ వాయిదా పడింది అనుకోండి. అయిహే ఈ సినిమాతో పాటే క్రిష్‌తో చేస్తున్న పాన్‌ ఇండియా పీరియాడిక్ సినియా షూట్ కూడా కొంత పూర్తి అయింది. 

అయితే కరోనా దెబ్బకి ఆ సినిమా షూట్ కూడా ఆగింది. ‘పింక్‌’ రీమేక్‌ కోసం ‘వకీల్‌ సాబ్‌’ అనే పేరు అనౌన్స్ చేశారు కానీ క్రిష్ సినిమా మీద ఇంకా క్లారిటీ లేదు. పవన్‌ - క్రిష్‌ సినిమా టైటిల్‌కు సంబంధించి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా విరూపాక్ష అనే టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్  చేయించారనే వార్తా బయటకు వచ్చింది. ఖుషీ లాంటి సినిమాని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో పవ దొంగగా నటిస్తున్నాడు. తెలంగాణాలో పేరుమోసిన దొంగ తెలంగాణా రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్నగా దర్శనమివ్వబోతున్నారట. అయితే రత్నం రిజిస్టర్ చేసిన టైటిల్ పవన్ కల్యాణ్ సినిమా కోసమేననే మాట వినిపిస్తోంది.  

More Related Stories