ఆమెలో విష‌యం ఉంది.. అమ‌లాపాల్ చెప్పిన న‌గ్న‌స‌త్యాలు..aame
2019-07-20 21:08:10

అమలాపాల్ నటించిన ఆమె సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అసలు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఇలాంటి ఒక చిత్రం వస్తుందని ఎవరికీ తెలియదు. కానీ ఫస్ట్ లుక్ విడుదల అయిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఏకంగా నగ్నంగా నటించడానికి ఒప్పుకోవడంతో సినిమాలో ఏదో ఉందని ఆసక్తి పెరిగిపోయింది. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపించింది. సినిమాలో ముఖ్యంగా అమ్మాయిల వేషధారణ, వస్త్రధారణ గురించి ఎక్కువగా టాక్ నడిచింది. తమకు ఇష్టం లేని బట్టలు వేసుకోవడం.. సమాజం కోసం వస్త్రధారణ ఎలా చేసుకుంటున్నారు అనే విషయంపై దర్శకుడు ఎక్కువగా ఫోక‌స్ చేసాడు. మరీ ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ లోనే మహిళలకు స్థనాల సైజుల్లో పన్ను కట్టాలి అని పోరాడే యువతిగా అమలాపాల్ నటించింది. ఇది ఓ విధంగా సంచ‌ల‌న‌మే. ఆ తర్వాత చీర కట్టుకోవడం ఎందుకు.. అసలు బట్టలు ఎందుకు వేసుకోవాలి.. అమ్మాయిలకు తమ బట్టలు తాము స్వేచ్ఛగా వేసుకునే హక్కు కూడా లేదా అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమాలో చర్చించాడు దర్శకుడు ర‌త్న కుమార్.
అలాగే అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయి అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా మొదలై చివరికి ఒక థ్రిల్లర్ గా ముగిసింది ఆమె. మహిళా సమస్యలనే ముఖ్యంగా ఈ సినిమాలో చర్చించాడు దర్శకుడు రత్నకుమార్. సినిమాలో హీరోయిన్ నగ్నంగా నటించింది కానీ నగ్నత్వం మాత్రం కనిపించదు అంటున్నారు అభిమానులు. కచ్చితంగా ఈ సినిమాలో సమాజం ఒప్పుకోలేని చాలా విషయాలను దర్శకుడు చూపించాడు. కనీసం మాట్లాడుకోవడానికి కూడా భయపడే కొన్ని నగ్న సత్యాలను తన సినిమాలో చూపించాడు రత్నకుమార్. ఈ సినిమాతో అమలపాల్ ఒక మంచి ప్రయత్నం చేసింది. అది కమర్షియల్ గా ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

 

More Related Stories