హాట్ సిరీస్ లో నటించేందుకు సిద్దమయిన అమలా పాల్ Amala Paul
2020-08-10 16:53:58

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన కూడా నటించిన తమిళ నటి అమలా పాల్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ పెళ్లి చేసుకొని సినిమాలకు బై చెప్పింది. కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె రీ ఎంట్రీ నుండి పూర్తిగా గ్లామర్ షో చేస్తోంది.  అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తమిళ్‌లో ఒక సినిమాను చేయగా దానిని తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఈ అమ్మడికి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో మరింత గ్లామర్ ఒలక బోసేందుకు సిద్దమయింది ఈ భామ. ఎప్పటి నుండో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే అమాలాపాల్‌ ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. 

తాజాగా ఈ భామ ఓ హాట్ వెబ్ సిరీస్‌ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే దాదాపుగా స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్‌ లు చేస్తుండగా అమలా పాల్ కూడా అదే బాటలో నడవడానికి రెడీ అయినట్టు చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ ని ఇటు తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కథ దాదాపు 1970 కాలంలో జరుగుందని అంటున్నారు. తమిళ్‌ లో ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని చెబుతున్నారు. అమలా పాల్ సినిమాల విషయానికి వస్తే 'ఆమె' సినిమా తర్వాత ఆమె తమిళ్లో ‘అధో అంధ పరవై పోలా’, ‘కాదవేర్’ సినిమాలు చేస్తుంది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి ‘ఆడు జీవితం’ అనే సినిమాలో నటిస్తోంది. 

More Related Stories