ఆ హీరోకు తల్లి పాత్రలో నటించబోతున్న అమల అక్కినేని..Amala
2019-11-01 18:07:56

అమ‌లా అక్కినేని.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అక్కినేని కోడ‌లిగా 20 ఏళ్లుగా సినిమాల‌కు దూరంగానే ఉంటున్నారు అమ‌ల‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న పాత్ర‌లు చేసినా కూడా ఎక్కువ‌గా ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఎప్పుడూ త‌న లోకంలో తానుంటారు అమ‌ల‌. త‌న‌కి మ‌న‌శ్శాంతి కావాల్సి వ‌చ్చిన‌పుడు అన్నీ దిలేసి హిమాల‌యాల‌కు వెళ్తుంది అమ‌ల‌. జంతువుల‌ను బాగా ప్రేమించే ఈమె.. ప్ర‌కృతిని కూడా అలాగే ఆస్వాదిస్తుంటారు. అందుకే అప్పుడ‌ప్పుడూ హిమాల‌యాలకు వెళ్తుంటుంది అక్కినేని కోడ‌లు. మాన‌సిక ఒత్తిడి త‌గ్గించుకోవ‌డం కోసం.. కోపం త‌గ్గించుకోవ‌డం కోసం.. ఆరోగ్యం కోసం.. హిమాల‌యాల‌కు వెళ్తుంటారు కొంద‌రు. ఇదే దారిలో అమ‌ల అక్కినేని కూడా వెళ్తుంది. ఇక ఇప్పుడు ఈమె న‌ట‌న మొద‌లు పెడ‌తుంది. ఆరేళ్ల కింద శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో అమ్మ పాత్ర‌లో న‌టించిన అమలా అక్కినేని... ఆ త‌ర్వాత కార్వాన్ లో చిన్న పాత్ర‌లో మెరిసింది.

ఇకిప్పుడు ఈమె త్వరలోనే శర్వానంద్ సినిమాలో నటించబోతుంది అమలా. ఈ మధ్యే పుష్పా ఇగ్నటిస్ తెర‌కెక్కించిన ఈ సిరీస్ 'జీ5' అనే వెబ్ సిరీస్ లో నటించింది అమల. ఇప్పుడు శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోకు తల్లి పాత్రలో నటించబోతుంది అమల. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈమె షూటింగ్ లో అడుగు పెట్టనుంది. సెకండ్ షెడ్యూల్ నుంచి వస్తుందని కూడా చెప్పారు. నాగార్జున కూడా అమ‌ల న‌ట‌న‌పై ఎప్పుడూ క‌మెంట్ చేయ‌లేదు. త‌న‌కు న‌చ్చితే న‌టించ‌డంలో త‌ప్పేం లేదు అంటాడు ఈయ‌న‌. కానీ అమ‌ల మాత్రం కుటుంబం.. త‌న జంతువులు అంటూ కాలం గ‌డిపేస్తుంది. అయితే ఇన్నేళ్ళ త‌ర్వాత ఎందుకో తెలియ‌దు కానీ న‌ట‌న వైపు అడుగులు వేస్తుంది అమ‌లా అక్కినేని. ఇక‌పై వీలున్న ప్ర‌తీసారి సినిమాల్లో న‌టించ‌డానికి కూడా ట్రై చేస్తానంటుంది అమ‌లా అక్కినేని. మ‌రి ఈమె కోరిక‌ను తీర్చే ద‌ర్శ‌కులు తెలుగులో ఎవ‌రున్నారో..?

More Related Stories