ఎఫ్3 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ F3 Amazon Prime
2021-01-13 00:28:21

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ లు కలిసి నటించిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 ని ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో కూడా హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన కూడా హీరోయిన్ లు గా తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్నారు. ఎఫ్2 లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించగా...ఎఫ్3 లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను దర్శకుడు చూపించబోతున్నాడట. ఇదిలా  ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ దక్కించుకుందట. ఎఫ్2 మంచి విజయం సాధించిన కారణంగా ఎఫ్3 డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ భారీగా చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఎఫ్ 3 ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
 

More Related Stories