పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం నిజంగా అంత పెద్ద నేరమా..pk
2020-02-01 03:04:06

రాజకీయాల్లో ఉన్నవారు వాళ్లు సినిమాలు చేయకూడదా.. జె డి లక్ష్మీనారాయణ జనసేన నుంచి వెళ్లిపోయిన తర్వాత అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించడం నేరం అవుతుందా.. ఎందుకు దాన్ని కారణంగా చూపించి లక్ష్మీనారాయణ బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ సినిమాలు కారణం ఎందుకు అడ్డు పెట్టుకున్నాడు.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పవన్ మాత్రమే సినిమాలు చేస్తున్నాడా.. బాలకృష్ణ, రోజా లాంటి వాళ్లు కూడా రెండు చోట్ల బిజీగా ఉన్నారు కదా.. మరి పవన్ కళ్యాణ్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు. పవన్ తిరిగి ఏమీ మాట్లాడడు కాబట్టి.. తన పని తాను చూసుకున్నాడు కాబట్టి ఎవరు ఏది పడితే అది మాట్లాడుతున్నారా అంటూ జన సైనికులు కూడా ప్రశ్నిస్తున్నారు. పార్టీ నడపడానికి కచ్చితంగా డబ్బులు కావాలి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే ఇది కారణంగా చూపించి పవన్ కళ్యాణ్ ను తప్పు చేసిన వాడిలా నిలబెట్టడం మాత్రం మంచిది కాదు అంటున్నారు అభిమానులు.

సాక్షాత్తు ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే సినిమాలు రాజకీయాలు ఒకేసారి చేశారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తే తప్పేముంది అంటున్నారు. దానికి తోడు మాజీ తెలుగుదేశం నేత అంబికా కృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేశాడు. ఎందుకు ఆయన్ను తప్పుబడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకు ఆస్తిపాస్తులు లేవని.. సినిమాలు చేసుకోకపోతే తనను నమ్ముకున్న కుటుంబాలూ అన్యాయం అయిపోతాయి అని చెబుతున్నాడు. తనకు పాల ఫ్యాక్టరీలు, సిమెంటు ఫ్యాక్టరీలు లేవని.. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కూడా కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాలకు కలిపి దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు పవర్ స్టార్.

More Related Stories