నన్ను రేప్ చేస్తారని వనికిపోయా.. అమీషా పటేల్

బీహార్ ఎన్నికల ప్రచారానికి హాజరైన నటి అమీషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. అమీషా బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎల్జేపి పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారానికి వెళ్ళింది. అయితే ఈ క్రమంలో అభ్యర్థి ప్రకాష్ చంద్ర బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. అమీషా చేస్తోన్న ఆరోపణలను ప్రకాష్ చంద్ర ఖండించడం తో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ వివాదానికి సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రకాష్ చంద్ర తనతో దురుసుగా ప్రవర్తించాడని, తేడాగా గా వ్యవహరించాడని అనీషా చెబుతోంది. అతడి ప్రవర్తన కారణంగా తాను భయపడ్డానని వెల్లడించింది. బీహార్ ప్రచారం ముగుసే వరకు ఎవరు రేప్ చేసి హత్య చేస్తారో అని భయపడ్డానని పేర్కొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముంబై కి వచ్చినట్టు తెలిపింది. తన టీమ్ సభ్యులు రక్షించడం సపోర్ట్ తోనే ప్రమాదం నుండి తప్పించుకున్నా అని పేర్కొంది. ముంబై కి వచ్చినప్పటికీ తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని పేర్కొంది. బీహార్ పర్యటన తనకు ఒక కాలరాత్రి లాగా మారిందని పేర్కొంది. అయితే అమీషా పటేల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి తాను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని చెబుతున్నాడు.