సైరా ఈవెంట్ లో నయనతార, అమితాబ్ బచ్చన్ ఎక్కడ..?amit
2019-08-20 21:49:00

సైరా నరసింహా రెడ్డి ఈవెంట్ ముంబైలో భారీగా నిర్వహించారు దర్శక నిర్మాతలు. ఈ ఒక్క వేడుకతోనే నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోయింది ఈ సినిమా. ఓ వైపు సాహో ఇప్పటికే అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు సైరా కూడా ఇదే పని చేస్తుంది. అయితే సైరా వేడుకకు అంతా వచ్చినా కూడా నయనతార, అమితాబ్ బచ్చన్ మాత్రం కనిపించలేదు. బాలీవుడ్ మీడియా ముందుకు మెగాస్టార్ కూడా వచ్చుంటే సైరా టీజర్ లాంఛ్ వేడుక మరింత గ్రాండ్ సక్సెస్ అయ్యేది. అయితే ఇప్పుడు ఈయన షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు కాస్త అనారోగ్యంతో కూడా ఉన్నాడు. దాంతో సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు రాలేకపోయాడు బచ్చన్ సాబ్. నయనతార పరిస్థితి మరోలా ఉంది. ఈమె ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. అక్కడే రజినీకాంత్ దర్బార్ సినిమా సెట్ లో ఉంది నయన్. రజినీకాంత్ తో కలిసి మూడోసారి నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే చంద్రముఖితో పాటు కథానాయకుడులో కూడా కలిసి నటించారు ఈ జోడీ. ఇప్పుడు మురుగదాస్ సినిమా కోసం మరోసారి రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కారెక్టర్ చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తుంది నయన్. మరోవైపు రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇలా ఇద్దరూ బిజీగా ఉండటంతో చిరంజీవి సైరా ఈవెంట్ కు మిస్ అయిపోయారు నయన్, బచ్చన్. వాళ్లు లేకపోయినా కూడా వాళ్ల గురించి చిత్రయూనిట్ మాత్రం తెగ పొగిడేసారు

More Related Stories