కరోనా కాలంలోనూ కేబీసీ..అమితాబ్ కీలక ప్రకటన Amitabh Bachchan
2020-05-04 18:34:50

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే రియాల్టీ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే టెలివిజన్ చరిత్రలో ఎన్నో సంచలనాకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ షో ఇప్పటికే 11 సీజన్స్ పూర్తి చేసుకొని 12వ సీజన్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అయితే కేబీసి 12కి సంబంధించి అమితాబ్ బచ్చన్ అఫీషియల్ ప్రకటన చేశారు. ఎందుకంటే లెక్క ప్రకారం ఈ షో మే 9 నుండి మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ కరోనా పరిస్థితుల్లో ఈ షో టెలీకాస్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఆ విషయాల మీద అమితాబ్ క్లారిటీ ఇచ్చారు.  మన జీవితంలో ప్రతి దానికి ఒక బ్రేక్ ఉంటుందన్న ఆయన కలలకి ఉండదని అన్నారు. మీ కలలకి రెక్కలు అందించేందుకు అమితాబ్ బచ్చన్ కేబీసీ 12తో బుల్లితెరపై రాబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మే 9 న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్‌లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అమితాబ్ ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. రాబోయే శనివారం అంటే మే 9వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ షో సోని టీవీలో ప్రసారం కానుంది. ఈ షోలో గెలిచిన వారికి కోటి రూపాయల నగదు ఇస్తారు. అమితాబచ్చన్ ఈ షోను గత 11 ఎపిసోడ్స్ సూపర్ సక్సెస్ చేయడంతో ఇప్పుడు దిగ్విజయంగా 12వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతుంది.

More Related Stories