హాస్పిటల్ నుంచి అమితాబ్ ట్వీట్.. అందరికీ వందనాలు..Amitabh Bachchan
2020-07-13 14:52:57

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. జయా బచ్చన్ మినహా.. అమితాబ్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య, అభిషేక్ అంతా కరోనా బారిన పడ్డారు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ కుటుంబం బాగుండాలని పూజలు కూడా చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికీ అమితాబ్, అభిషేక్ ముంబై నానావతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అమితాబ్ అక్కడ్నుంచే ట్వీట్ చేసాడు. తన కుటుంబంలోని అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య.. అలాగే తన కోసం దైవ ప్రార్ధనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు అమితాబ్. మీ అందరినీ గుర్తించడం నాకు కష్టం కావొచ్చు.. అందుకే మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నా.. రెండు చేతులూ జోడించి మొక్కుతున్నా.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ బిగ్ బి ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. 

More Related Stories