క్లాసిక్ అమృతం మళ్ళీ మొదలు..ఎప్పటి నుండి అంటేamrutham
2020-02-21 20:09:07

టెలివిజన్‌ చరిత్రలో తమకంటూ కొన్ని రికార్డులు సృష్టించుకున్న షోలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది ‘అమృతం’. ఈ సీరియల్‌ లాంటి సిరీస్ గురించి సెపరేట్‌ గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడంటే వెబ్ సిరీస్ అని కొందరు పేర్లు పెట్టి చూపిస్తున్న చెత్త చూస్తున్నాం కానీ ఆరోజుల్లోనే మనకి సిరీస్ ని పరిచయం చేశారు జస్ట్ ఎలో అధినేత గుణ్ణం గంగరాజు. అయితే చానాళ్లు పాటు నడిచిన ఈ సిరీస్ ఆగిపోయింది. ఈ సీరియల్‌ను  కొంత మంది ప్రేక్షకులు యూట్యూబ్ వేదికగా చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఒక్కో సీరియల్‌కు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ కి కొనసాగింపుగా అమృతం 2 అంటూ వెబ్ సిరీస్ ను తయారు చేసే పనిలో పడింది గుణ్ణం గంగరాజు అండ్ టీం.ఇందులో కూడా అంజి, సర్వం, అప్పాజీ ఇలా అన్ని పాత్రలు ఉంటాయి. అయితే ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటించిన గుండు హనుమంతరావు ప్రస్తుతం స్వర్గస్తులు అయ్యారు కాబట్టి అయన పాత్రలో సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. ఇక మిగిలిన వారు అమృతం 2 లో కూడా కొనసాగనున్నారు. ఈ సిరీస్ మార్చ్ 25 నుండి జీ5 యాప్ లో అందుబాటులోకి రానుంది.

 

More Related Stories