పవన్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఆయన చిరకాల మిత్రుడు



Anand Sai
2021-02-25 15:07:20

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అంటే ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' సినిమా మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాల వరకు ఆయన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

కొంత కాలం విరామం తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన మొదట పవర్ స్టార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..మళ్ళీ గ్యాప్ తరవాత కూడా పవన్ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఆనంద్ సాయి సినిమాకు పని చేస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఆయనకు వెల్కమ్ చెప్పింది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

More Related Stories