పవన్ కోసం సెట్ వేసిన ఆనంద సాయి Anand Sai
2021-05-20 18:08:09

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తికాగా లాక్ డౌన్ తరవాత షూటింగ్ ను పట్టాలెక్కిచ్చే ప్లాన్ లో ఉన్నారు. అంతే కాకుండా ఈ చిత్రం కోసం మ్యూజిక్ అప్పుడే మొదలెట్టి రెండు పాటలు కూడా పూర్తి చేసినట్టు దేవిశ్రీప్రసాద్ వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఓ భారీ కాలేజీ సెట్ ను వేశారు. చాలా కాలం గ్యాప్ తరవాత ఆనంద సాయి మళ్లీ పవన్ సినిమా కోసం పని చేస్తున్నా అని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 

కాగా ఇప్పుడు సెట్ ను కూడా పూర్తి చేసేసారు. అంతే కాకుండా ఈ సెట్ అద్భుతంగా ఉండటంతో పలువురు ఆనంద సాయిని అభినందిస్తున్నారట. ఇక ఈ సినిమాలో లెక్చరర్ గా నటించబోతున్న పవన్ త్వరలోనే సెట్స్ లో అడుగు పెట్టనున్నారు. అంతే కాకుండా ఇదే సినిమాలో పవన్ పోలీస్ రోల్ చేయబోతున్నట్టుగా కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఉంటే ప్రస్తుతం పవన్ మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా...మరో సినిమా అయ్యప్పనుమ్ కొషియం రీమేక్. ఇక జూన్ నుండి ఈ రెండు సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్ సినిమాను పట్టాలెక్కిస్తే ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉంటాయి.

More Related Stories