తెలుగు ఇండస్ట్రీపై కన్నేసిన అనన్య పాండే.. Ananya panday
2020-04-11 18:03:52

అనన్య పాండే.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో ఎవరికీ పెద్దగా తెలియదు కానీ కచ్చితంగా మరో ఆర్నెళ్లలో మార్మోగిపోతుంది. దానికి కారణం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ. ఈ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఇప్పటికే అదిరిపోయే హాట్ షో చేస్తుంది. విజయ్ దేవరకొండకు తాను పడిపోయానని.. ఆయన నేచర్ అద్భుతం అంటూ పొగిడేస్తుంది కూడా. అంతే కాదు బాలీవుడ్ బ్యూటీ కావడంతో అందాల ఆరబోతకు కూడా పెద్దగా అడ్డంకులు లేవు. ఈమె తండ్రి కూడా సినిమా నటుడే. బాలీవుడ్ ఫేమస్ విలన్ చుంకీ పాండే కూతురే అనన్య పాండే. 

కరణ్ జోహార్ చేతుల మీదుగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ వారసురాలు ఇప్పుడు అక్కడ బాగానే పేరు తెచ్చుకుంది.. అవకాశాలు కూడా పర్లుదనిపిస్తున్నాయి. ఇదే సరైన సమయం అంటూ టాలీవుడ్ కు కూడా వచ్చేస్తుంది అనన్య. ఇక్కడ విజయ్ లాంటి యంగ్ సెన్సేషన్ తో నటించడం ఆనందంగా ఉందని చెబుతుంది. కచ్చితంగా ఫైటర్ తర్వాత టాలీవుడ్ లో తన గురించి మాట్లాడుకుంటారని చెబుతుంది ఈ భామ. ఇప్పటికే అనన్య కోసం మన స్టార్ హీరోలు కూడా ట్రై చేస్తున్నారు. మరో రెండు సినిమాలు కానీ వచ్చాయంటే ఇక్కడే సెటిల్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలిక.. అనన్య జాతకాన్ని విజయ్ దేవరకొండ, పూరీ ఎలా మార్చేస్తారో..?

More Related Stories