అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ భరద్వాజ్..ANU
2019-12-26 05:04:58

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం జిఎస్టీ, ఐటి దాడుల కలకలం జరుగుతుంది. ఇందులో సుమ కనకాల కూడా ఉందనే వార్తలు వచ్చినా కూడా ఆమె తను లేనని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని మీడియాపై సీరియస్ అయింది. ఇక మరో యాంకర్ అనసూయ కూడా జిఎస్టీ ఎగ్గొట్టిందనే వార్తలొచ్చాయి. ఈమె కూడా తన ఇంటిపై ఎలాంటి ఐటీ రైడ్స్ జరగలేదని.. మీడియా చాలా ఓవర్ చేసిందని విరుచుకుపడింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మరోలా ఉంది. ఇప్పుడు యాంకర్ అనసూయకు జిఎస్టీ అధికారుల నుంచి అధికారులు నోటీసులు రావడంతో ఇప్పుడేమంటావ్ అనసూయ అంటూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. అంతా ఆమెను ప్రశ్నిస్తున్నారు. అనసూయ దాదాపు 55 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది. దాంతో నోరెళ్లబెడుతున్నారంతా.. కేవలం 25 లక్షలు మాత్రమే కట్టి.. మిగిలిన అమౌంట్ ఇప్పటి వరకు క్లియర్ చేయలేదని ప్రచారం జరుగుతుంది. సర్వీస్ ట్యాక్స్ కింద 80 లక్షలు బకాయి ఉన్న అనసూయ 25 లక్షలు మాత్రమే కట్టినట్లు గుర్తించారు. మిగతా డబ్బు చెల్లించడం కోసం కొంత సమయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఇప్పుడు అనసూయ ఏమంటుందో చూడాలిక.

More Related Stories