విలన్ గా రంగమ్మత్తanu
2020-02-18 07:38:42

బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి రాణించడం అందరి వలనా కాదు. వాగుడు కాయ అనిపించుకున్న సుమ సైతం సినిమాల్లో నిలవలేక పోయింది. కానీ అనసూయ మాత్రం చాలా సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ వెండి తెర మీద కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఆమెలోని నటిని మరో స్థాయికి తీసుకెళ్లి ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత కధనం, మీకు మాత్రమే చెప్తా లాంటి సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆమె ఇప్పుడు విలన్ గా మారబోతుందని టాలీవుడ్‌ టాక్‌. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ మీద కుర్ర హీరో విజయ్‌ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో అనసూయకు ఈ అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అధికారికం కాకున్నా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనసూయ సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో కూడా ఆమెది నెగటివ్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories